రామాయంపేట, రామాయంపేట రూరల్, మే 13: దివ్యాంగ మహిళను తలపై బండరాయితో మోది హత్యచేసి రామాయంపేట మండలం తొనిగండ్ల గ్రామ శివారులో మృతదేహాన్ని పడేసిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు దివ్యాంగ మహిళ(35)ను ఎక్కడో బండరాయితో తలపై మోది చంపేసి ఓ కారులో మృతదేహాన్ని తొనిగండ్ల గ్రామ శివారులో పడేశారు.
విషయం తెలుసుకున్న రామాయంపేట పోలీసులు సీఐ వెంకటరాజగౌడ్, ఎస్సై బాలరాజులు తమ సిబ్బందితో హుటాహటిన ఘటనాస్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని రామాయంపేట ప్రభుత్వ దవాఖాన మార్చురీకి తరలించారు. అంతకుముందు జిల్లా ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, తూప్రాన్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని సందర్శించారు. హత్య చేసిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.