సిద్దిపేట అర్బన్, జూన్ 12: సిద్దిపేటలోని ఎల్లంకి ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ వెల్ఫేర్ పాఠశాల 9వ తరగతి విద్యార్థి డి.దినేశ్ ఇటీవల నేపాల్‌లోని ఎవరెస్ట్ బేస్‌క్యాంప్ శిఖరాన్ని ఈనెల 3న అధిరోహించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ నాగలత గురువారం తెలిపారు.
ఎంజేపీ సొసైటీ నుంచి పది మంది బాలురు, పది మంది బాలికలను ఎంపిక చేసి ఎవరెస్ట్ బేస్ క్యాంపునకు పంపించారని, ఈ గ్రూప్‌లో తమ పాఠశాల విద్యార్థి డి.దినేశ్ ఉన్నట్లు తెలిపారు. దినేశ్‌ను మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, గురుకుల పాఠశాలల సెక్రటరీ సైదులు అభినందించినట్లు తెలిపారు. విద్యార్థులు చదువుకే పరిమితం కాకుండా క్రీడల, ఇతర రంగాల్లో రాణించాలని ప్రిన్సిపాల్ పిలుపునిచ్చారు.