నర్సాపూర్, నవంబర్ 4: మెదక్ జిల్లా నర్సాపూర్ ఏరియా ప్రభుత్వ దవాఖానలో వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, మెదక్ ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, కలెక్టర్ రాహుల్‌రాజ్‌తో కలిసి సోమవారం డయాలసిస్ సెంటర్‌ను ప్రారంభించారు. ప్రారంభోత్సవ కవరేజికి వచ్చిన విలేకరులతోపాటు స్థానిక నాయకులను పోలీసులు సెంటర్లోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. కొందరి నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
విలేకరులు లోపలికి వెళ్తామని పోలీసులకు విన్నవించుకున్నా వారిని కూడా అనుమతించలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులు వచ్చినప్పుడు ఇ లాంటి ఆంక్షలు ఉండేవి కావని పలువురు నాయకులు వాపోయారు.జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్, మంత్రి దామోదర రాజనర్సింహ బయటకి వచ్చి విలేకరులతో మాట్లాడుతున్న సమయంలో లోపలికి ఎందుకు అనుమతించలేదని ప్ర శ్నించగా మంత్రి తన ఉపన్యాసం ముగించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ విషయంపై సీఐ జాన్‌రెడ్డిని వివరణ కోరగా దవాఖాన సూపరింటెండెంట్ ఆదేశాల మేరకే డయాలసిస్ సెంటర్లోకి ఎక్కువ మందిని అనుమతించలేదని వెల్లడించారు.