సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 1: సిద్దిపేట పోలీస్ కమిషనరేట్‌లో 2023 ఆగస్టులో సైబర్‌క్రైమ్ పోలీస్‌స్టేషన్ ప్రారంభించామని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ తెలిపారు. సైబర్ నేరగాళ్ల చేతుల్లో రూ.లక్ష వరకు పోగొట్టుకున్న బాధితులు మంగళవారం నుంచి 1930 నెంబర్‌కు కాల్ చేయడం, https://cybercrime.gov.in వెబ్సైట్లో వివరాలు నమోదు చేయడం లేదా పోలీస్ కమిషనరేట్‌లోని రెండోఫ్లోర్లో ఉన్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో నేరుగా దరఖాస్తు చేస్తే కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభిస్తామని తెలిపారు. రూ.1 నుంచి రూ.99,999 వరకు సైబర్ నేరాల్లో డబ్బులు పోగొట్టుకున్న బాధితులు దరఖాస్తు చేసుకోవచ్చని సీపీ తెలిపారు.