మెదక్ రూరల్ సెప్టెంబర్ 28: మెదక్, హవేలీ ఘనపూర్ మండలల వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆయా గ్రామాలలో ఆలయాలు, మండపాలు భక్తులతో కిటకిటలాడు తున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. ఆదివారం మాచవరంలో అమ్మవారు చండీ దేవి ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు.
వివిధ మండపాల్లో పసుపు కుంకుమార్చన పూజలు చేశారు. ఈ ఉత్సవాల్లో భాగంగా మాచవరంలో ఏర్పాటు చేసిన అమ్మవారు అదివారం చండీదేవి ప్రత్యేక అలంకరణలోభక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు పసుపు కుంకుమ ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో స్వాములు, తదితరులుఉన్నారు.