గజ్వేల్, మార్చి 1: సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావుపై అక్రమ కేసులు తగవని రైతుబంధు సమితి రాష్ట్ర కౌన్సిల్ మాజీ సభ్యుడు దేవీరవీందర్ అన్నారు. శనివారం గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, ప్రజల పక్షాన పోరాడుతున్న తెలంగాణ ఉద్యమ నాయకుడు హరీశ్‌రావుపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ కేసులు పెడుతున్న వ్యక్తి చక్రధర్‌గౌడ్ అని గుర్తుచేశారు. అలాంటి వ్యక్తి ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేస్తారా అని ప్రశ్నించారు.
చక్రధర్‌గౌడ్‌తో ప్రభుత్వమే అక్రమంగా హరీశ్‌రావుపై కేసులు పెట్టించిందన్నారు. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టించినా భయపడే వ్యక్తి హరీశ్‌రావు కాదన్నారు. గతంలో కేటీఆర్, కవిత, బీఆర్ఎస్ నేతలపై ఎన్నో అక్రమ కేసులు బనాయిస్తున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేసులు పెడుతూ ప్రజల్లో మెప్పు పొందాలని చూస్తున్న రేవంత్‌కు ప్రజల నుంచి వ్యతిరేకత మొదలైందన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నేతలు పాల రమేశ్‌గౌడ్, నిజాం పాల్గొన్నారు.