పట్టణాలకు దీటుగా పల్లెలు
సీఎం కేసీఆర్ నాయకత్వంలో గ్రామాలు అభివృద్ధి బాట పట్టాయని రాష్ట్ర హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు.
- నిరంతర ప్రక్రియగా అభివృద్ధి పనులు
- హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్
- కంది మండలంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన
కంది, నవంబర్ 27: సీఎం కేసీఆర్ నాయకత్వంలో గ్రామాలు అభివృద్ధి బాట పట్టాయని రాష్ట్ర హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. ఆదివారం కంది మండలంలోని ఎద్దుమైలారం, ఇంద్రకరణ్, కౌలంపేట, మామిడిపల్లి, తున్కిలతండా, వడ్డెనగూడ తండా, ఎర్ధనూర్, బేగంపేట గ్రామాల్లో చింతా ప్రభాకర్ పర్యటించి సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారన్నారు. సంగారెడ్డి జిల్లాలోని ప్రతి పంచాయతీకి రూ.20 లక్షల నిధులు కేటాయించారన్నారు.
మారుమూల గ్రామాలు, తండాలను పంచాయతీలుగా తీర్చిదిద్ది సకల సౌకర్యాలు కల్పించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. పట్టణాలకు తీసిపోకుండా పల్లెలు సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటున్నాయన్నారు. గ్రామాల్లో నిరంతర ప్రక్రియగా అభివృద్ధి పనులు కొనసాగుతూనే ఉంటాయన్నారు. గ్రామాల పర్యటనలో తన ముందుకొచ్చిన పనులు, సమస్యలను పరిష్కరిస్తానని హామీనిచ్చారు. అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రజలు అండగా నిలవాలన్నారు. అభివృద్ధి పనుల ప్రారంభానికి వెళ్లిన చింతా ప్రభాకర్‌కు పార్టీ నాయకులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.
కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, ఎంపీపీ సరళా పుల్లారెడ్డి, జడ్పీటీసీ కొండల్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ కృష్ణాగౌడ్, టీఆర్ఎస్ కంది మండల అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, నాయకులు రాంరెడ్డి, ఖాజాఖాన్, చిల్వేరి ప్రభాకర్, నందకిశోర్, వేణువర్ధన్రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

