– సంగారెడ్డి, సెప్టెంబర్ 14 :వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి జిల్లాలోని ఐదు శాసనసభ స్థానాలు గెలిచి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కానుకగా ఇస్తామని సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అభ్యర్థి, హెచ్‌డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. గురువారం సంగారెడ్డిలో డీసీఎంఎస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుకు అన్ని విధాలా అండగా నిలబడుతున్నదన్నారు. రెండు పంటలకు సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని పేర్కొన్నారు. – సంగారెడ్డి, సెప్టెంబర్ 14
సంగారెడ్డి, సెప్టెంబర్ 14: జిల్లాలోని ఐదుకు ఐదు శాసనసభ స్థానాలు గెలిచి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కానుకగా ఇస్తామని చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. గురువారం డీసీఎంస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ మోడల్ కోసం ఇతర రాష్ర్టాలు ఎదురుచూస్తున్నయన్నారు.
అన్నదాతకు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందించడంతోపాటు సాగుకు పెట్టుబడి, నిరంత విద్యుత్, రైతుబీమా అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లా అభివృద్ధికి నిధులు ఇస్తూ సాగు, తాగు నీటి గోసను తీర్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. జిల్లా, నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి హరీశ్‌రావు ఎనలేని కృషి చేస్తున్నారన్నారు. స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని బుధవారం కొండాపూర్‌లో ఒనీన్ జ్యూస్ పరిశ్రమ శంకుస్థాపనకు వచ్చిన మంత్రి కేటీఆర్‌ను కోరడం సంతోషకరమన్నారు.
సాగు నీటికి ఢోకా లేదు
సంగారెడ్డి జిల్లాలో నేడు రెండు పంటలు పండేందుకు సమృద్ధిగా నీరు ఉన్నదని డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ అన్నారు. నిరంతర విద్యుత్, సాగు నీటి ప్రాజెక్టులతో సాగు, తాగు నీటికి ఇబ్బందులు తొలిగాయన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి 48 గంటల్లో రైతుల ఖాతాల్లో సొమ్ము జమచేస్తుండడం హర్షణీయమన్నారు. ఎరువుల కోసం ఉమ్మడి జిల్లాలో 3 రేక్ పాయింట్లు, సనత్‌నగర్ రేక్ పాయింట్లు ఉన్నాయన్నారు. ప్రభుత్వ అనుబంధ సంఘాలతో రైతులకు 60శాతం ఎరువులు సరఫరా అవుతున్నాయన్నారు. రైతులకు సకాలంలో పంట రుణాలు అందిండంలో డీసీసీబీ సేవలు అందిస్తున్నదన్నారు. మార్కెట్లో ఎరువులు బ్లాక్ చేసే డీలర్లపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నదని తెలిపారు. సమావేశంలో సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మాజీ జడ్పీటీసీ మనోహర్‌గౌడ్ పాల్గొన్నారు.