అందోల్ గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అన్నారు. వట్పల్లి మండలం పోతులబొగుడలోని ఎమ్మెల్యే స్వగృహంలో మునిపల్లి మండలం బుస్సారెడ్డిపల్లి, పెద్దలోడి, మేళాసంఘం గ్రామాలకు చెందిన 200 మంది, అందోల్ మండలం నేరడిగుంటకు చెందిన 50 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే వారికి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వివరిస్తూ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని వారికి సూచించారు.
– అందోల్, జూలై 17
అందోల్, జూలై 17: అందోల్ గడ్డపై మరోసారి ఎగిరేది గులాబీ జెండానేనని, రాష్ట్రంలో అధికారం చేపట్టేది మనమేనని.. ముచ్చటగా మూడోసారి సీఎం అయ్యేది కేసీఆర్ సారేనని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. వట్పల్లి మండలం పోతులబొగుడలోని ఎమ్మెల్యే స్వ గృహంలో మునిపల్లి మండల ప్రధాన కార్యదర్శి శశికుమార్ ఆధ్వర్యంలో బుస్సారెడ్డిపల్లి, పెద్దలోడి, మేళాసంఘం గ్రామాలకు చెందిన 2వందల మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అందోల్ మండలం నేరడిగుంట గ్రామానికి చెందిన 50 మంది కాంగ్రెస్ నాయకులు ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు కృష్ణాగౌడ్ ఆధ్వర్యంలో, ఎర్రారం సర్పంచ్ ప్రవీణ్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు ఆకర్షితులై కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్కు తప్ప మరే పార్టీకి చోటులేదన్నారు. సీఎం కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. పార్టీ నాయకులు కలిసి మెలిసి పని చేయాలని పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ అభివృద్ధి పనులు ప్రజలకు వివరిస్తూనే పార్టీని మరింత బలోపేతం చేసేందుకు దృష్టి సారించాలన్నారు. రేపటి నుంచి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ విధానాలకు నిరసనగా అన్ని గ్రామాల్లో రైతులతో కలిసి రైతువేదికల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతామన్నారు.
ఉచిత విద్యుత్‌పై కాంగ్రెస్ చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొడతామన్నారు. కాంగ్రెస్‌ను నమ్మితే రాష్ర్టాన్ని మళ్లీ పాత రోజుల్లోకి తీసుకెళ్తారని, ఈ విషయం ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు తెలిపారు. అంతకు ముందు అందోల్-జోగిపేట మున్సిపల్ చైర్మన్ మల్ల య్య ఆధ్వర్యంలో కౌన్సిలర్లు ఎమ్మెల్యేను కలిసి అభివృద్ధి పనుల విషయంపై చర్చించారు. కార్యక్రమంలో రాష్ట్ర మార్కుఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్రెడ్డి, మునిపల్లి మండల ప్రధాన కార్యదర్శి శశికుమార్, వరం చైర్మన్ వీరారెడ్డి, నాయకులు వీరేశం పాల్గొన్నారు.