శివ్వంపేట, జులై 18 : విద్యార్థుల అభ్యున్నతే లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేయాలని డీఈఓ రాధాకిషన్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన శివ్వంపేట ప్రభుత్వ పాఠశాలను ఎంఈఓ బుచ్యానాయక్తో కలసి డీఈవో సందర్శించారు. పాఠశాలలోని రిజిష్టర్లను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడి వారినుంచి సమాధానాలు రాబట్టారు.
అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడి విద్యార్థులకు మంచి బోధన అందించాలని సూచించారు. విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. సమయ పాలన పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎం బాలచంద్రం, సీఆర్పీ రవీందర్ తదితరులు ఉన్నారు.