పటాన్చెరు రూరల్, జూన్ 28: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని ఇంద్రేశం గ్రామంలో అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు. అక్రమంగా అదనపు అంతస్తు నిర్మిస్తున్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు గ్రామపంచాయతీ కార్యదర్శి సుభాష్ ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బంది స్లాబ్‌ను కట్టర్ మెషి న్లు వాడి శనివారం కూల్చివేశారు.
ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ అనుమతులకు మించిస్లాబ్ వేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అదనపు నిర్మిస్తున్నారనే ఫిర్యాదులు రావడంతో చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇంద్రేశం గ్రామ పరిధిలో అక్రమ నిర్మాణాలు, అదనంగా నిర్మిస్తున్న అంతస్తులపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. నిబంధనల ప్రకారం వ్యవహరిస్తామని ఆయన స్పష్టం చేశారు.
జిన్నారం, జూన్ 28: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కొడకంచి గ్రామంలోని సర్వేనంబర్ 5 ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన ప్రహరీని తహసీల్దార్ దేవదాస్ ఆదేశాల మేరకు పోలీసుల సమక్షంలో ఆర్ఐ జయప్రకాశ్‌నారాయణ శనివా రం కూల్చివేయించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని స్థానికులను ఆర్ఐ హెచ్చరించారు. కార్యక్రమంలో రెవెన్యూ, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.