అమీన్పూర్, అక్టోబర్ 17: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ సర్వే నంబర్ 993, 992, 991లో అక్రమ నిర్మాణాలను శుక్రవారం అమీన్పూర్ తహసీల్దార్ వెంకటేశ్ ఆధ్వర్యంలో కూల్చివేశారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ స్థలాల ఆక్రమణలు, అక్రమ కట్టడాలు చేపట్టిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలతో పాటు కూల్చివేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ భూములలో నిర్మిస్తున్న కట్టడాలను 15 వరకు కూల్చివేసినట్లు ఆయన తెలిపారు.