టేక్మాల్/మెదక్ : అత్యాచారం కేసులో నిందితుడ్ని అరెస్టు చేసినట్లు మెదక్ డీఎస్పీ సైదులు తెలిపారు. టేక్మాల్ పోలీస్ స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. టేక్మాల్ మండల పరిధి సూరంపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళను అదే గ్రామానికి చెందిన ఈశ్వరయ్య అక్టోబర్ 14వ తేదీన అత్యాచారం చేశాడు.
విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని బాధితురాలు కొద్ది రోజులుగా ఎవరికి చెప్పలేదు. అయితే ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడంతో విచారణలో ఈశ్వరయ్య నేరం చేసినట్లుగా ఒప్పుకుననాడని తెలిపారు.
ఈ మేరకు నిందితుడ్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ జార్జ్, ఏఎస్సై తుక్కయ్య, ఐడీ పోలీసులు అరవింద్, మల్లప్ప లను అభినందించారు.