ములుగు, జూన్ 23 : సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధికి కేరాఫ్‌గా నిలుస్తున్నదని డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం మున్నూరుకాపు కమ్యూనిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నిరంగాల్లో రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడుపుతూ దేశంలోనే నెంబర్‌వన్ రాష్ట్రంగా తెలంగాణను నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌కే సొంతమన్నారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ యువత విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జుబేర్‌పాషా, ఎంపీటీసీ ప్రవీణ్, ఉపసర్పంచ్ సురేశ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు సాదుల శంకర్, బీసీసెల్ మాజీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, ములుగు మాజీ ఉపసర్పంచ్ దండె కరుణాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఆరె పెంటయ్య, శ్రీరాములు పాల్గొన్నారు.