రామాయంపేట, జూన్ 01: సైక్లింగ్లో విద్యార్థులను అద్భుతంగా తీర్చిదిద్దుతానని జాతీయ సైక్లింగ్ అవార్డు గ్రహీత, ఖేలో ఇండియా రామాయంపేట సెంటర్ కన్వినర్ దండు యాదగిరి పేర్కొన్నారు. ఆదివారం ఖేలో ఇండియాలో భాగంగా రామాయంపేట పట్టణంలోని మెదక్ చౌరస్తాలో సైక్లింగ్ రన్ ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులకు ప్రతి ఆదివారం ఉదయం 6గంటల నుండి 8గంటల పాటు సైక్లింగ్లో ప్రావీణ్యం పొందేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు.
సైక్లింగ్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయన్నారు. ఆరోగ్యాలు బాగుతో బాటు రాబోయే కాలంలో విద్యార్థులు మంచి ప్రతిభను సాధిస్తారన్నారు. అందు కోసం నేటి నుండి ప్రతి ఆదివారం ఖేలో ఇండియాలో భాగంగా రామాయంపేటలో సైక్లింగ్ పోటీలు నిర్వహిస్తానని జాతీయ ఆవార్డు గ్రహీత యాదగిరి తెలిపారు.