సీఎం కేసీఆర్ కృషితో దళిత కుటుంబాల్లో వెలుగులు
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి
నిజాంపేట మండలం రాంపూర్‌లో
డెయిరీ ఫామ్, పౌల్ట్రీ ఫామ్
నిర్మాణాలకు భూమి పూజ
కల్వకుంటలో కొనుగోలు కేంద్రం ప్రారంభం
చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని వెల్లడి
నిజాంపేట/చిన్న శంకరంపేట, మే 6 ః దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి అమలుచేస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని రాంపూర్‌లో దళిత బంధు ద్వారా 6 మంది లబ్ధిదారులకు మంజూరైన డెయిరీ ఫామ్, పౌల్ట్రీ ఫామ్ నిర్మాణాలకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. అనంతరం కల్వకుంటలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి పెద్దమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వాలు దళితులను ఏమాత్రం పట్టించుకోలేదని, సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో నేడు దళితుల కుటుంబాల్లో వెలుగులు నిం డుతున్నాయన్నారు. దళితబంధు యూనిట్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని అన్నారు.
కేంద్రం ధాన్యం కొనకపోయినా, రాష్ట్రం ప్రభుత్వం చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించడం హర్షించదగ్గ విషయమన్నారు. రైతులందరూ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటలక్ష్మి, డిప్యూటీ తహసీల్దార్ గంగప్రసాద్, ఎంపీపీ సిద్ధిరాములు, నిజాంపేట, కల్వకుంట పీఏసీఎస్ చైర్మన్లు బాపురెడ్డి, కొండల్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి,మండల యూత్ అధ్యక్షుడు మావురం రాజు, మండల కో-ఆప్షన్ సభ్యుడు గౌస్, రైతుబంధు సమితి మం డల అధ్యక్షుడు సంపత్, మండల సర్పంచ్‌లు రజిత, ఎంపీటీసీలు బాల్‌రెడ్డి, సురేశ్, తిరుమల ఆలయ కమిటీ చైర్మన్ మహేశ్, టీఆర్ఎస్ నేతలు మహేశ్, లక్ష్మణ్, వెంకటస్వామిగౌడ్, దుబ్బరాజుగౌడ్, పెంటాగౌడ్ తదితరులు ఉన్నారు.
ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత
ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత వస్తుందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. చిన్నశంకరంపేట మండలం సాలిపేటలో పెద్దమ్మతల్లి ఆలయ వార్షికోత్సవాల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతిఒక్కరూ ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ లావణ్యారెడ్డి, జడ్పీటీసీ మాధవి, రైతుబంధు మండలాధ్యక్షుడు లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ మండలశాఖ అధ్యక్షుడు రాజు, సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.