సిద్దిపేట, జూన్ 11: సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త అవతారం ఎత్తుతూ ప్రజలను దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సిద్దిపేట పట్టణ మున్సిపల్ కమిషనర్ పేరిట ఆయా షాప్‌ల యజమానులకు ఫోన్ చేస్తూ ట్రేడ్ లైసెన్స్ ఫీజ్ బకాయిలు చెల్లించాలని, లేనియెడల పెనాల్టీ పడుతుందని బెదిరింపు కాల్ చేసిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది.
సిద్దిపేట మున్సిపల్ పరిధిలోని పలు షాపుల యజమానులకు 7780110865 ఫోన్ నెంబర్‌తో మున్సిపల్ కమిషనర్‌ను మాట్లాడుతున్నా అంటూ ఫోన్లు చేసి వెంటనే ట్రేడ్ లైసెన్స్ ఫీజు బకాయిలు మేం పంపించిన సానర్కు చెల్లించాలని బెదిరించారు.
దీంతో వ్యా పారులు స్థానిక కౌన్సిలర్ ధర్మవరం బ్రహ్మ దృష్టికి తీసుకెళ్లడంతో మున్సిపల్ అధికారులను ఆరా తీశారు. దీంతో మున్సిపల్ అధికారులు తాము ఎవరికీ ఫోన్ చేయలేదని, అలాంటి ఫోన్ కాల్స్‌కు ఎవరూ స్పందించవద్దని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ మాట్లాడారు. ఫేక్ కాల్స్ పట్ల వ్యాపారులు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నా రు. ట్రేడ్ లైసెన్స్ ఫీజుల బకాయిలు వ్యాపారు లు, దుకాణాదారులు మున్సిపల్ కార్యాలయంలోని కౌంటర్లో లేదా బిల్ కలెక్టర్‌కు చెల్లించాలన్నారు. మున్సిపాలిటీ నుంచి ఎలాం టి క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేయలేదన్నారు. వ్యాపారులు ప్రజలు ఇలాంటి ఫేక్ కాల్స్‌తో జాగ్రత్తగా ఉండాలన్నారు.