జగన్మాతా నమో నమః
ఏడుపాయల వనదుర్గా భవానీమాత సన్నిధిలో ఆదివారం పెద్దఎత్తున భక్తుల సందడి నెలకొన్నది. సుదూర ప్రాంతాల నుంచి ఏడుపాయల చేరుకున్న భక్తులు మంజీరా నదిలోని వివిధ పాయల్లో పుణ్యస్నానాలు చేసి, దుర్గామాతను దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు.
- కిక్కిరిసిన ఏడుపాయల వనదుర్గామాత ఆలయం
- వివిధ ప్రాంతాల నుంచి భక్తుల రాక
- మంజీరా నదిలో పుణ్యస్నానాలు
- మొక్కులు చెల్లించుకున్న భక్తులు
- అన్ని ఏర్పాట్లు చేసిన ఆలయ నిర్వాహకులు
పాపన్నపేట, ఆగస్టు 20: ఏడుపాయల వనదుర్గా భవానీమాత సన్నిధిలో ఆదివారం పెద్దఎత్తున భక్తుల సందడి నెలకొన్నది. సుదూర ప్రాంతాల నుంచి ఏడుపాయల చేరుకున్న భక్తులు మంజీరా నదిలోని వివిధ పాయల్లో పుణ్యస్నానాలు చేసి, దుర్గామాతను దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. పలువురు భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం, కుంకుమార్చనలు, తలనీలాలు, బోనాలు సమర్పించారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏడుపాయల చైర్మన్ సతెల్లి బాలాగౌడ్, ఆలయ ఈవో సార శ్రీనివాస్, సిబ్బంది సూర్య శ్రీనివాస్, మధుసూదన్‌రెడ్డి, రవివీర్ కుమార్, తోట నరసింహులు, వరుణాచారి, రాజు, శ్రీకాంత్, సంతోష్ తదితరులు ఏర్పాట్లు చేశారు. వేద పండితులు శంకర శర్మ, పార్థివ శర్మ, మురళీధర్ తదితరులు ప్రత్యేక పూజలు చేశారు. పాపన్నపేట ఎస్సై మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు చర్యలు చేపట్టారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

