మెదక్: టేక్నాల్ మండలంలో రెండు మృతదేహాలు కలకలం రేపాయి. దాదాయిపల్లిలో ఈ మృతదేహాలు చూసిన స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. గ్రామ శివారులోని గచ్చుకుంటలో ఈ మృతదేహాలు కనిపించాయి. ఇవి ఇద్దరు చిన్నారులకు చెందిన మృతదేహాలని స్థానికులు గుర్తించారు.
వెంటనే పోలీసులకు ఈ సమాచారం అందించారు. చిన్నారులను రిశ్వంత్ (4), రక్షిత(2)గా గుర్తించిన గ్రామస్థులు.. వీరి తల్లి కోటంగారి రంజిత (25) కోసం గాలిస్తున్నారు. భర్తే ఈ పిల్లలను హత్య చేసి కుంటలో పడేసి ఉంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు.