CCTVs | సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణ
CCTVs | సీసీ కెమెరాలు ఏర్పాటుతో నేరాల నియంత్రణ అరికట్టవచ్చునని తొగుట సీఐ షేక్ లతిఫ్ అన్నారు.
రాయపోల్ : సీసీ కెమెరాలు( CCTV Cameras ) ఏర్పాటుతో నేరాల నియంత్రణ అరికట్టవచ్చునని తొగుట సీఐ షేక్ లతిఫ్ ( CI Shaik Lateef ) అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో 8 సీసీ కెమెరాలను ప్రారం భించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల దొంగతనాలు, అనుమానాస్పద ఘటనలను గుర్తించే అవకాశం ఉంటుందని తెలిపారు.
నేరస్తులను గుర్తించి పట్టుకోవడంలో సీసీ కెమెరాలు పోలీసులకు కీలక ఆధారాలుగా ఉపయోగపడతాయని చెప్పారు. ప్రజల భద్రత కోసం ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అవసరమని సూచించారు. ఇప్పటికే అనేక గ్రామాల్లో మన ఊరు.. మన పోలీస్ కార్యక్రమం ద్వారా సీసీ కెమెరాల ఏర్పాటుతోపాటు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని గుర్తు చేశారు.
గ్రామాల్లో ప్రజాప్రతినిధులు. దాతలు ముందుకు వచ్చి సీసీ కెమెరాల ఏర్పాటు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎక్కాల శ్యామల మల్లేశం. ఉపసర్పంచ్ స్వామి. ఎస్సై మానస, పోలీస్ సిబ్బంది, యువకులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

