సిద్దిపేట, జూన్ 29: తీవ్ర వర్షాభావ పరిస్థితు ల్లో పంటలు ఎండిపోయి, పెట్టిన విత్తనాలు మొలవక భూగర్భ జలాలు అడుగంటి, వర్షా లు పడక సిద్దిపేట జిల్లాలో తీవ్ర కరువు విలయతాండవం చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చుక రాములు అన్నారు. ఆదివారం జిల్లా కార్యవర్గ సభ్యుడు కాముని గోపాలస్వామి అధ్యక్షతన కార్మిక కర్షక భవన్ లో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి చుక రాములు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
సిద్దిపేట ప్రభుత్వం కరువు జిల్లాగా ప్రకటించి రైతులు, రైతు కూలీలను ఆదుకోవాలన్నారు. జిల్లాలో రెండు నెలలుగా వర్షాలు లేవని, విత్తిన విత్తనాలు మొలకెత్తక పెట్టుబడులు పెట్టిన రైతులు దికుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం జిల్లాను యూనిట్‌గా తీసుకొ ని కరువు అంచనా వేసి కరువు జిల్లాగా ప్రకటించాలని, కరువు నివారణ చర్యలు చేపట్టి నష్టపరిహారం అందించాలని కోరారు.
గ్రామాల్లో సమస్యలు పేరుకుపోయాయని, కనీస సౌకర్యాలు ప్రభుత్వం కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సమస్యలు పరిషరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సీపీఎం ఆధ్వర్యంలో పెద్దఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు శశిధర్, ఎల్లయ్య, సత్తిరెడ్డి, భాసర్ జిల్లా కమిటీ సభ్యులు వెంకటి,యాదగిరి, రవి, బాలనర్సయ్య, అరుణ్‌కుమార్, శ్రీనివాస్, రవీందర్ పాల్గొన్నారు.