బెజ్జంకి, మే 11: పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సీపీఐ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ జాతీ య కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ఆదివారం ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మంద పవన్‌తో కలిసి ఆయన మాట్లాడారు. పెహెల్గాంలో ఉగ్రవాదులు అమాయక హిందూ బిడ్డలను పొట్టన పొట్టుకోవడం హేయమైన చర్య అన్నారు.
దీనికి దీటుగా కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్‌లోని ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసి, పాక్‌కు తగిన బుద్ధి చెప్పిందన్నారు. పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త సమిష్టిగా కృషి చేయాలని కోరారు. అనంతరం పెహెల్గాం మృతులకు నివాళులర్పించారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి బోనగిరి రూపేశ్, సీనియర్ నాయకుడు పొతిరెడ్డి వెంకట్‌రెడ్డి, నాయకుడు సంగెం మధు తదితరులు పాల్గొన్నారు.