మెదక్ రూరల్, నవంబర్ 14 : రైతుల కోసం నిరంతరం కృషి చేస్తామని మెదక్ సొసైటీ చైర్మన్ చిలుముల హనుమంత్ రెడ్డి అన్నారు. మెదక్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయ ఆవరణలో బుధవారం సహకార వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. సొసైటీ చైర్మన్ చిలుముల హనుమంత్ రెడ్డి సహకార జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు పంటలకు సంబంధం లేకుండా పంట రుణాలు అందిస్తున్నామని తెలిపారు.
ఉమ్మడి మండలంలోని అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం సొసైటీల ద్వారా రైతులకు అందిస్తున్న సేవలను వివరించారు. సభ్యులు స్వల్ప, దీర్ఘకాలిక రుణాలను తీసుకొని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు రాములు, నారాయణరెడ్డి, రామ్ రెడ్డి శంకర్, సిబ్బంది పెంటయ్య సంతోష్ శ్రీనాథ్ ,సాయిచరణ్, మహేందర్ కిష్టయ్య, గోపాల్, నాగరాజ్, రైతులు పాల్గొన్నారు.