పుల్కల్, సెప్టెంబర్ 16: సంగారెడ్డి జిల్లాలోనే అతిపెద్ద ప్రాజెక్టు సింగూరు ప్రాజెక్టు. ఇటీవల కురిసిన వర్షాలతో ప్రాజెక్టు పూర్తిగా నిండింది. ఎగువన కురిసిన వర్షాలకు ప్రాజెక్టులోకి వరద వస్తుండడంతో వచ్చిన నీటిని వచ్చినట్టుగానే దిగువన ఉన్న విద్యుత్ జెన్కోకు నీటిని విడుదల చేస్తున్నారు.
దీంతో విద్యుత్ అధికారులు రెండు టర్బైన్ల ద్వారా ఈ ఏడాది సెప్టెంబర్ 5 నుంచి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. ప్రాజెక్టు నుంచి జలవిద్యుత్ కేంద్రానికి రోజూ 2,363 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో ఇప్పటి వరకు 3,962 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. 2023-24లో 10.77 మిలియన్ యూనిట్స్ విద్యుత్ ఉత్పత్తి నమోదైనట్లు జెన్కో సీఈ రమేశ్‌బాబు వెల్లడించారు.
ఈ ఏడాది 15 నుంచి 20 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రాజెక్టులోకి 1887 క్యూసెక్కులు వస్తుం డగా, దిగువకు 3612 క్యూసెక్కులు వెళ్తున్న ట్లు, ప్రాజెక్టు అధికా రులు తెలిపారు. ప్రా జెక్టులో నీటి నిల్వ 29.469 టీఎంసీలు ఉందని ప్రాజెక్టు ఏఈ మహిపాల్ రెడ్డి వెల్లడించారు.