నర్సాపూర్ : శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణానికి ( School building Constuction ) శనివారం డెక్కన్ రౌండ్ టేబుల్ ట్రస్ట్ ఇండియా చైర్మన్ దంపతులు ఆదిత్య కెడియా( Aditya Kedia) శనివారం భూమిపూజ చేశారు.
నర్సాపూర్ (Narsapur ) మున్సిపల్ పరిధిలోని రెండవ వార్డులో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల- 1 భవనం శిథిలావస్థకు చేరి కూలడానికి సిద్ధంగా ఉంది. నూతన భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వాన్ని అధికారులను విన్నవించుకున్న ఫలితం లేకుండా పోయిందని కౌన్సిలర్ లతారమేశాయాదవ్ గుర్తుచేశారు.
ఈ విషయం తెలుసుకున్న డెక్కన్ రౌండ్ టేబుల్ ట్రస్ట్ ఇండియా- 189 స్పందించి నూతన భవన నిర్మాణానికి ముందుకు వచ్చారు. పాఠశాల నూతన భవనానికి, బాత్రూమ్ గదులకు రూ.50 లక్షలు మంజూరు చేసి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ భవన నిర్మాణ పనులు మూడు నెలల్లో పూర్తి చేస్తామని ట్రస్ట్ చైర్మన్ ఆదిత్య కెడియా హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ లతారమేశ్యాదవ్, ఎంఈవో తారాసింగ్, ప్రధానోపద్యాయులు సర్వేశ్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థి విద్యార్ధులు పాల్గొన్నారు.