నర్సాపూర్,అక్టోబర్ 20: అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, గద్దెనెక్కిన తర్వాత అన్నివర్గాలను మోసం చేసిందని, కాంగ్రెస్ పతనం ప్రారంభమైందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం నర్సాపూర్‌లో కాంగ్రెస్‌కు చెందిన పలువురు కార్యకర్తలు ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరా రు. హత్నూర మండలం కోనంపేటకు చెందిన గిరియాదవ్, నరహరి యాదవ్, సురేశ్, బాలరాజు, మల్లేశ్, భిక్షపతి, అశో క్, పర్వతాలు, లక్ష్మణ్‌తోపాటు సుమారు 43 మంది కాం గ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరారు.
ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏ ఒక్క హామీ సరిగ్గా అమలు కాకపోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆవేదనతో ఉన్నారని, ప్రజలకు సమాధానం చెప్పలేక విరక్తి చెందుతున్నారని వెల్లడించారు. మున్ముందు బీఆర్ఎస్లోకి భారీగా వలసలు జరుగుతాయని జోస్యం చెప్పారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్, కోనంపేట బీఆర్ఎస్ అధ్యక్షుడు దాసరి బాలేశ్ యాదవ్, అంబటి అర్జున్, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సత్యంగౌడ్, షేక్ హుస్సేన్ పాల్గొన్నారు.