టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి
ఎమ్మెల్యే క్రాంతికిరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేయనున్న జాబ్‌మేళా పోస్టర్లు, ఫ్లెక్సీలు తీసుకువెళ్తున్న టీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు దాడిచేసి తీవ్రంగా గాయపర్చడంతో పాటు బైక్‌ను తగలబెట్టడంతో అందోల్-జోగిపేటలో సోమవారం ఉద్రిక్తత వాతవరణం నెలకొంది. పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన నీరుడి దుర్గుశ్, మల్లేశ్, గొల్ల లక్ష్మణ్ సోమవారం సాయంత్రం
అందోల్, డిసెంబర్ 5: ఎమ్మెల్యే క్రాంతికిరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేయనున్న జాబ్‌మేళా పోస్టర్లు, ఫ్లెక్సీలు తీసుకువెళ్తున్న టీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు దాడిచేసి తీవ్రంగా గాయపర్చడంతో పాటు బైక్‌ను తగలబెట్టడంతో అందోల్-జోగిపేటలో సోమవారం ఉద్రిక్తత వాతవరణం నెలకొంది. పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన నీరుడి దుర్గుశ్, మల్లేశ్, గొల్ల లక్ష్మణ్ సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి స్వ గ్రామానికి జాబ్‌మేళా పోస్టర్లు, ఫ్లెక్సీలు తీసుకు వెళ్తున్నారు. ఇదే సమయంలో ఎదురుగా బైక్ ర్యాలీతో వస్తున్న కాంగ్రెస్(దామోదర్ జన్మదినం సందర్భంగా బైక్‌ర్యాలీ) నాయకులు వారిని ఆపి ఫ్లెక్సీలు కిందపడేసి కొట్టడంతో పాటు బైక్‌ను దహనం చేశారు. దీంతో సమాచారమందుకున్న టీఆర్ఎస్ నాయకుడు రాహుల్‌కిరణ్, స్థానిక నాయకులు కాంగ్రెస్ నాయకుల తీరును నిరసిస్తూ సంగారెడ్డి- హైదరాబాద్ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు .
ఈ సందర్భంగా రాహుల్‌కిరణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు ప్రశాంతంగా ఉన్న అందోల్ ప్రజల మధ్యన చిచ్చుపెడుతున్నారని విమర్శించారు. గాయపడిన బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు జోగిపేట సీఐ నాగరాజు తెలిపారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక కాంగ్రెస్ నాయకులు నీచ రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ధ్వజమెత్తారు. ఇలాంటి అరాచకాలు అందోల్ ప్రజలు ఏమాత్రం సహించరని పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. డీఎస్పీ రవీందర్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

కాంగ్రెస్ నాయకులు నిప్పంటించిన బైక్
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

