పటాన్చెరు టౌన్, జూన్ 27 : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం భానూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ ముఖ్య నాయకులు, వార్డు సభ్యులు హైదరాబాద్‌లో మాజీ మంత్రి హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వార్డు సభ్యులు ప్రవళిక నరేందర్, యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సాగర్, జిల్లా కార్యదర్శి శివయ్య తమ అనుచరులతో కలిసి శనివారం సాయంత్రం బీఆర్ఎస్లో చేరారు. వీరికి పార్టీ కండువా వేసి హరీశ్‌రావు బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.
అనంతరం బీఆర్ఎస్లో చేరిన భానూరు నాయకులు పటాన్చెరులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వీరిని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మాజీ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ విధానాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరడం అభినందనీ యమన్నారు. వీరి చేరికతో భానూరులో బీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతం అయినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దశరథ్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, గూడెం మధుసూదన్‌రెడ్డి, విజయ్‌కుమార్, శ్రీధర్‌చారి, శ్యాంసుందర్‌రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.