మాటమార్చడం కాంగ్రెస్ నాయకులకు అలవాటు
ఎల్ఆర్ఎస్పై రాష్ట్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా మెదక్ జిల్లా కేంద్రంలోని అంబేదర్ చౌరస్తాలో బుధవారం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆపార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
- బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి
మెదక్, మార్చి 6 (నమస్తే తెలంగాణ) : ఎల్ఆర్ఎస్పై రాష్ట్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా మెదక్ జిల్లా కేంద్రంలోని అంబేదర్ చౌరస్తాలో బుధవారం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆపార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలువడం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చడం కాంగ్రెస్ పార్టీ నాయకులకు అలవాటుగా మారిందన్నారు. అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామని 2020 అక్టోబర్ 10న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పిన మాటలు ఉత్తమాటలుగానే మిగిలిపోయాయని ధ్వజమెత్తారు. డిసెంబర్ 9న రైతులకు రెండు లక్షల రుణమాఫీ అని ఇప్పటి వరకు చేసిన దాఖలాలు లేవన్నారు.
అనంతరం అడిషనల్ కలెక్టర్ రమేశ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి. నియోజకవర్గ ఇన్చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కౌన్సిలర్లు కృష్ణారెడ్డి, కొట్టాల విశ్వం, సులోచన, జయరాజ్, వసంతరాజ్, సమీయొద్దీన్, మెదక్, నిజాంపేట్ ఎంపీపీలు యమునజయరాంరెడ్డి, సిద్ధిరాములు, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు అంజాగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, పట్లూరి రాజు, సుధాకర్‌రెడ్డి, నాయకులు సోములు, లక్ష్మిరెడ్డి, రాగిఅశోక్, లింగారెడ్డి, శ్రీధర్ యాదవ్, సలాం, కృష్ణ, అంజద్, రామచంద్రారెడ్డి, జుబేర్, బట్టి ఉదయ్, సాయిలు, కిషన్ బాలరాజు, మోహన్ పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్‌ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
Moderate Rains | రేపు, ఎల్లుండి తెలంగాణలో మోస్తరు వర్షాలు : వాతావరణ శాఖ
CJP Protest: సీఆర్పీఎఫ్ను కొట్టిన మహిళా యూట్యూబర్.. కేసు నమోదు చేసిన పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

