నంగునూరు, జనవరి 26: అధికారిక కార్యక్రమాల్లో ప్రొటోకాల్ ఉల్లంఘనలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్ నాయకులు వేదికల మీద చేరి హల్చల్ చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నాగరాజుపల్లిలో ఆదివారం కాంగ్రెస్ నాయకుడు పూజల హరికృష్ణ ప్రజాపాలన గ్రామసభలో పాల్గొనడమే కాకుండా ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రొసీడింగ్స్ పంపిణీ చేయడం చర్చకు దారితీసింది.
ఎలాంటి ప్రొటోకాల్ లేని వ్యక్తి అధికారిక వేదిక పైన చేరి ఎలా ప్రొసీడింగ్లు పంపిణీ చేస్తాడని ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. అధికారులు ఎలా అనుమతించారని పలువురు బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.