బీఆర్ఎస్ హయాంలో నారాయణఖేడ్ నియోజకవర్గంలో పరుగులు పెట్టిన అభివృద్ధి, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభు త్వంలో స్తంభించింది. కాంగ్రెస్ అధికా రం చేపట్టిన ఈ రెండున్నరేండ్లలో నియో జకవర్గంలో పెద్దగా చేసిందేమీ లేకపోగా, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన పనులు ముందుకు సాగకుండా కళ్లెం వేసే ప్రయత్నాలు చేస్తుండటం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రజలకు ఉపకరించే అనేక అభివృద్ధి పనులను అప్పటి కేసీ ఆర్ ప్రభుత్వం ప్రారంభించడం, తదనం తరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆయా పనులు అసంపూర్తిగా ఆపేసింది. ప్రభుత్వమేదైనా ప్రారంభించిన పనుల ను పూర్తిచేసే దిశగా చర్యలు చేపట్టాల్సి ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు భిన్నంగా కక్షపూరితంగా వ్యవహరి స్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నారాయణఖేడ్, జూన్ 1 : సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రారంభించిన పనులను పూర్తిచేస్తే పార్టీకి మంచి పేరొస్తుందనే అక్కసు కాంగ్రెస్ పాలకుల్లో నెలకొంది. దీంతో అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, పథకాలను కప్పిపెట్టేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారు. పాలకులు వ్యవహరిస్తున్న తీరుపై నియోజకవర్గంలో సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతున్నది.
దశాబ్దాలుగా సాగు నీటి కోసం అలమటిస్తున్న నారాయణఖేడ్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే దిశగా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని 1.31 లక్షల ఎకరాలకు సాగు నీరందించే ప్రణాళికతో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి బ్రేక్ పడింది. రూ.1,774 కోట్లతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు పరిధిలో నారాయణఖేడ్ నియోజకవర్గంలోని అన్ని మండలాలతో పాటు అందోల్ నియోజకవర్గంలోని రేగోడ్, వట్పల్లి మండలాల్లో అదనంగా మరో 34 వేల ఎకరాలకు సాగు నీరందించేలా ప్రాజెక్టును రూపొందించారు. అప్పటి సీఎం కేసీఆర్ మనూరు మండలంలోని బోరంచ శివారులో బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన ఈ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేస్తుందని భావించిన ప్రజల ఆశలు అడియాసలు అయ్యాయి. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేండ్లు గడుస్తున్నా ఈ ప్రాజెక్టు పనుల్లో ఒక్క అడుగు ముందుకు పడలేదు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో నారాయణఖేడ్ నియోజకవర్గంలో మొత్తం 8 కొత్త చెరువులు మంజూరు చేసింది. నాగల్గిద్ద మండలం ఇరక్‌పల్లి-1, ఇరక్‌పల్లి-2, మోర్గి, ఉట్పల్లి, కేశ్వార్, ఏస్గి, నారాయణఖేడ్ మండలం జగన్నాథ్‌పూర్, కంగ్టి మండలం చుక్కల్తీర్థ్లో చెరువుల నిర్మాణానికి రూ.56.47 కోట్ల నిధు లు కేటాయించి పనులు ప్రారంభించింది. భూసేకరణ కోసం అదనంగా మరో రూ.19 కోట్లు మంజూరు చేసి ప్రక్రియ పూర్తి చేసింది. ఆయా చెరువుల నిర్మాణానికి యుద్ధప్రాతిపదికన పనులు కొనసాగుతుండగా, ఎన్నికలు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో చెరువుల పనులు మందగించాయి. ప్రజల ఒత్తిడి మేరకు ఒకటి రెండు చెరువుల పనులు నత్తనడకన కొనసాగడం మినహా, మిగతా చెరువుల పను లు తట్టెడు మట్టి తీయలేని స్థితి లో నిలిచిపోయాయి. ప్రభుత్వం చెరువుల నిర్మాణంపై దృష్టిసారించపోవడంతో నష్టం జరుగుతున్నది.

బీఆర్ఎస్ హయా ంలో తడ్కల్ కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటు ప్రక్రియ తుది దశలో ఉండగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దానిని అటకెక్కించింది. తడ్కల్ మండలాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్ దశాబ్దాలుగా ఉంది. ప్రజల ఆకాంక్షను సాకారం చేసే దిశగా ముందడుగు వేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం, 15 గ్రామాలతో తడ్కల్ కేంద్రంగా కొత్త మండలాన్ని ఏర్పాటు చేస్తూ 2023,సెప్టెంబర్ 4న కేసీఆర్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తదనంతరం ఎన్నికలు జరిగి కాంగ్రెస్ ప్రభు త్వం రావడంతో తడ్కల్ మండలం ఏర్పాటుకు ఏమాత్రం చర్యలు చేపట్టలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు తమ ప్రచారంలో తడ్కల్ మండలాన్ని ఏర్పాటు చేస్తామని ఊదరగొట్టారు. బీఆర్ఎస్ హయాంలోనే ప్రక్రియను పూర్తి చేసి ఉత్తర్వులు సైతం ఇచ్చినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేండ్లు అయినా మండలం ఏర్పాటు దిశగా చర్యలు కనిపించడం లేదు.
నారాయణఖేడ్ పట్టణ సమీపంలోని జూకల్ శివారులో బీఆర్ఎస్ ప్రభుత్వం 795 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంజూరు చేసి, అత్యధిక శాతం ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేసింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం దరఖాస్తులను స్వీకరించింది. కుటుంబాల వారీగా విచారణ చేపట్టి అర్హులను ఎంపిక చేశారు. అనంతరం లాటరీ పద్ధ్దతి ద్వారా లబ్ధ్దిదారులను ఎంపిక చేసి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించారు. తుది దశ పనులు కొనసాగుతుండడంతో ఎన్నికల తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు అందజేయాలని నిర్ణయించగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
బీఆర్ఎస్ హయాంలో మిషన్ భగీరథ పథ కం ద్వారా ప్రతిరోజు ఇంటింటికీ నీటిని సరఫరా చేయగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో రోజుల తరబడి నీటి సరఫరా నిలిచిపోతున్నది. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం ప్రతి పంచాయతీకి ట్రాక్టర్, ట్యాంకర్‌ను అందజేసి పల్లెలు కళకళలాడేలా చర్యలు తీసుకుంది. ఇప్పుడు అవన్నీ కనిపించని స్థితిలో గ్రామాలు విలవిలలాడుతున్నాయి. అత్యధిక పంచాయతీల్లో ట్రాక్టర్లు మూలకు చేరగా, పర్యవేక్షణ కొరవడి గ్రామాలు మురికి కూపాలను తలపిస్తున్నా యి. రోడ్ల పరిస్థితి వేరే చెప్పనక్కర్లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రారంభించిన పలు రోడ్ల పనులు నిలిచిపోగా, మరికొన్ని నిధులు మం జూరైనా పనులు చేపట్టకపోవడం, కొన్నింటిని పూర్తిగా రద్దు చేయగా, మిగతావి బీఆర్ఎస్ హయాంలోని టెండర్లను రద్దు చేసి తిరిగి టెండర్లు పూర్తి చేసినా ఫలితం మాత్రం శూ న్యం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, నర్సరీలు, హరితహారం వంటివి అతీగతీ లేకుండా వినియోగానికి వీలు లేని స్థితికి చేరాయి.
బీఆర్ఎస్పై కక్ష సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభు త్వం నారాయణఖేడ్ నియోజకవర్గంలో అభివృద్ధిని అడ్డుకుంటున్నది.బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన పనులను కొనసాగించి, పూర్తి చేసేందుకు ఇబ్బంది ఎందుకు. ప్రజలకు జరిగే మేలును పక్కన పెట్టి కేవలం రాజకీయ దురుద్దేశంతో వ్యవహరించడం సరికాదు. కేసీఆర్ బసవేశ్వర ఎత్తిపోతల పథకాన్ని రూపొందించి పనులు ప్రారంభిస్తే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పనులు చేపట్టకుండా రైతులకు అన్యాయం చేస్తుంది. కేసీఆర్ ప్రజల ఆకాంక్షలను గౌరవించి తడ్కల్ మండలం ఏర్పాటుకు జీవో ఇచ్చినప్పటికీ, దానిపై అభ్యంతరాలు చూపి కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. ప్రభుత్వ స్థలంలో పైసా ఖర్చు లేకుండా కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ నిర్మించి ఇవ్వగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు పేరిట లబ్ధిదారుడికి రూ.15 లక్షల వరకు ఖర్చు చేయిస్తున్నది. బీఆర్ఎస్కు మంచి పేరు వస్తుందనే ఒకేఒక్క కారణం చేత కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో మంజూరైన పనులను చేపట్టకుండా తాత్సారం చేస్తున్నది.
-ఎం.భూపాల్‌రెడ్డి ,నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే