మైనంపల్లి దెబ్బతో మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఖాళీ అవుతోంది. కాంగ్రెస్ పార్టీలోని క్యాడర్ అంతా బీఆర్ఎస్ గూటికి చేరుతున్నది. చిన్నశంకరంపేట మండలానికి చెందిన నలుగురు ఎంపీటీసీలు, మండల అధ్యక్షుడు పోతరాజు రమణ కారు ఎకారు. తాజాగా గురువారం వైస్ ఎంపీపీ సత్యనారాయణ గౌడ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి సమక్షంలో గులాబీ గూటికి చేరారు. వారికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్లో చేరుతున్న వారికి తప్పకుండా న్యాయం జరుగుతుందన్నారు. పదేండ్ల క్రితం ఎమ్మెల్యేగా కొనసాగిన మైనంపల్లి మెదక్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి శూన్యమని అన్నారు. అనంతరం జకన్నపేట ఉపసర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామంలోని యువత పెద్దఎత్తున బీఆర్ఎస్లో చేరారు.
మెదక్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతున్నది. మలాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు రాక తో కాంగ్రెస్‌లోని కేడర్ అంతా బీఆర్ఎస్ గూటికి చేరుతున్నది. కాంగ్రెస్ పార్టీలో కష్ట పడ్డ కార్యకర్తలకు విలు వ లేదని, ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కారెక్కుతున్నారు. ఇప్పటికే చిన్నశంకరంపేట మండలానికి చెందిన నలుగురు ఎంపీటీసీలు, మండల అధ్యక్షుడు పోతరాజు రమణ బీఆర్ఎస్లో చేరారు. గురువారం మండలం వైస్ ఎంపీపీ సత్యనారాయణ గౌడ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి సమక్షంలో గులాబీ గూటికి చేరారు. ఈ సందర్భంగా వారికి కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆర్ఎస్లో చేరుతున్న వారికి తప్పకుండా న్యాయం జరుగుతుందని, సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. పదేండ్ల క్రితం మైనంపల్లి హన్మంతరావు ఎమ్మెల్యేగా కొనసాగినా మెదక్ నియోజకవర్గంలో చేసింది శూన్యమన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మెదక్ నియోజకవర్గానికి కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. కార్యకర్తలకు విలువ లేకుండా పోయిందని మనస్తాపంతో రాజీనామాలు చేస్తున్నారన్నారు. వారితోపాటు మండల సోషల్ మీడియా కన్వీనర్ నవీన్, మండల కార్యకర్తలు పార్టీలో చేరారు. కార్యక్రమంలో హవేళీఘనపూర్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, చిన్నశంకరంపేట పార్టీ మండల అధ్యక్షుడు రాజు, మెదక్ మండల అధ్యక్షుడు అంజాగౌడ్, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు కొత్తపల్లి కిష్టయ్య పాల్గొన్నారు.
హవేళీఘనపూర్ మండలంలోని జకన్నపేట ఉప సర్పంచ్ శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో గ్రామంలోని యువత పెద్దఎత్తున బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పద్మక నాయకత్వంలోనే మెదక్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని విశ్వాసం వ్యక్తంచేశారు.