కాంగ్రెస్‌కు ఓటేస్తే తెలంగాణ అధోగతి పాలవుతుందని, బీఆర్ఎస్కు ఓటేస్తే కేసీఆర్ తెలంగాణను నంబర్‌వన్ స్థానంలో నిలుపుతారని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం హవేళీఘనపూర్ మండలంలోని తొగిట, మద్దుల్వాయి, ముత్తాయికోట, కూచన్‌పల్లి, ముత్తాయిపల్లి, ఫరీద్పూర్, వాడి, రాజ్పేట్, కొత్తపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.
మెదక్ అర్బన్, నవంబర్ 5: కాంగ్రెస్‌కు ఓటు వేస్తే తెలంగాణ అధోగతి పాలవుతుందని, బీఆర్ఎస్కు ఓటేస్తే కేసీఆర్ తెలంగాణను నంబర్ వన్ స్థానంలో నిలుపుతారని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం హవేళీఘనపూర్ మండలంలోని తొగిట, మద్దుల్వాయి, ముత్తాయికోట, కూచన్‌పల్లి, ముత్తాయిపల్లి, ఫరీద్పూర్, వాడి, రాజ్పేట్, కొత్తపల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లోని ప్రజలు బోనాలు, డప్పుచప్పుళ్లతో మహిళలు మంగళహారతులు, కోలాటంతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడు తూ.. సీఎం కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సంక్షేమ పథకాలతో ప్రజలందరికీ న్యాయం చేశారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటికి లబ్ధి చేకూరిందన్నారు. కాంగ్రెస్ నాయకులు రైతు భరోసా పేరుతో ప్రజలను మళ్లీ మోసం చేస్తున్నారన్నారు.
కాంగ్రెస్ రైతు భరోసా అని రూ.15,000 అంటున్నారు, కానీ కేసీఆర్ ఎకరానికి రూ.16,000 ఇస్తామని అంటున్నారని పేర్కొన్నారు. ఝూటామాటల కాంగ్రెస్‌ను నమ్మి మోసపోవద్దని, ప్రజలు అభివృద్ధిని చూసి ఓటు వేయాలన్నారు. సీఎం కేసీఆర్ వృద్ధులు, ఒంటరి మహిళలకు రూ.5000 పింఛను ఇస్తామని తెలిపారన్నారు. మెదక్ తనకు సెట్ కాదని చెప్పి మైనంపల్లి హన్మంతరావు మల్కాజిగిరికి వెళ్లాడని, 13 ఏండ్ల తర్వాత మెదక్ ఎందుకు గుర్తుకొచ్చిందని ప్రశ్నించారు. ఇన్ని రోజులు మెదక్ ప్రజల మంచి చెడులను చూడని మైనంపల్లి అసెంబ్లీ ఎన్నికలు రాగానే కొడుకు కోసం మెదక్ నియోజవర్గానికి వచ్చిండన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మూడు గంటల కరెంట్ ఇస్తామని అంటున్నారని, కాని సీఎం కేసీఆర్ 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్నారన్నారు. ప్రజలు ఆలోచించి మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని ఆమె కోరారు.