ప్రాజెక్టులపై కాంగ్రెస్ నిర్లక్ష్యం
జిల్లాలో కొండపోచమ్మ సాగర్ ఉన్నా ఫలితం లేకుం డా పోయిందని, రిజర్వాయ ర్లు నింపకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని రైతులు ఆవేదన వ్య క్తం చేశారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ ప్రాజెక్టు వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, రైతు సంఘాల ప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
- కరువొచ్చినా నీళ్లివ్వని దిక్కుమాలిన ప్రభుత్వం ఇది..
- బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆగ్రహం
- సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ ప్రాజెక్టు వద్ద బీఆర్ఎస్ నాయకుల నిరసన
- వేలాదిగా తరలివచ్చిన బీఆర్ఎస్ నాయకులు, రైతులు
మర్కూక్, జూలై 17: జిల్లాలో కొండపోచమ్మ సాగర్ ఉన్నా ఫలితం లేకుం డా పోయిందని, రిజర్వాయ ర్లు నింపకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని రైతులు ఆవేదన వ్య క్తం చేశారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ ప్రాజెక్టు వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, రైతు సంఘాల ప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ రైతాంగాన్ని కాంగ్రెస్ పూర్తిగా నిర్ల క్ష్యం చేస్తున్నదని విమర్శించారు. కాళేశ్వరంలో నీళ్లు ఉన్నా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రిజర్వాయర్లలో నింపడం లేదని మండిపడ్డారు.
కేసీఆర్ ప్రభుత్వంలో రిజర్వాయర్లు నిండుగా ఉండేవని, నేడు నీటి కొరతతో వెలవెలబోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వానకాలం పంటలకు సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. తాగునీటి సమస్యలు రోజురోజుకూ తీవ్రమవుతున్నప్పటికీ ప్రభుత్వ స్పందించక పోవడం బాధాకరమన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వంలో సాగు, తాగు నీటి కోసం కేసీఆర్ ప్రాజెక్టులు నిర్మిస్తే, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నదన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు ఉపసంహరించుకోవాలని, రైతాంగాన్ని ఆదుకునే చర్యలను ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
“కొండపోచమ్మ-మల్లన్నసాగర్ నింపాలి-రైతులను కాపాడాలి, సాగునీరు మాహక్కు-సాధించే వరకు పోరాటమే” అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి, బీఆర్ఎస్ మర్కూక్ మండల అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, గజ్వేల్ మున్సిపల్ చైర్పర్సన్ చందనా రవి,దేవీ రవీందర్, పాండుగౌడ్, రామచంద్రం, బాల్‌రెడ్డి, స్థానిక సర్పంచ్ బుల్లెరాణీమల్లేశం, మ్యాకల కనకయ్య, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కనకయ్య, మాజీ సర్పంచ్ భాస్కర్, బీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

