మిరుదొడ్డి, మే 4 : మల్లన్నసాగర్ ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు కాలువల నిర్మాణ పనులు పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మిరుదొడ్డి మండలం చెప్యాలలో మల్లన్నసాగర్ కాలువలను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి పరిశీలించారు. అక్కడి నుంచే ఇరిగేషన్ అధికారులకు, కాంట్రాక్టుకు ఫోన్ లో మాట్లాడారు. కాలువల నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్నసాగర్ నిర్మించి సాగునీటికి ధీమా కల్పించిందన్నారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఉప కాలువలు నిర్మించలేని దుస్థితిలో ఉందని విమర్శించారు. కేసీఆర్ రైతులకు చేయూతనిస్తే, రేవంత్ వ్యవసాయ రంగాన్ని చిన్నచూపు చూస్తున్నారని విమర్శించారు. కార్యక్రమం లో మాజీ సర్పంచ్ కవితా రాజు, మిరుదొడ్డి మాజీ ఎంపీపీ కవితా శ్రీనివాస్, ఏఎంసీ మాజీ చైర్మన్లు బాపురెడ్డి, సత్యనారాయణ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అంజిరెడ్డి, నాయకులు రాజమహేందర్ రెడ్డి, నర్సింహులు, సురేందర్, చెప్యాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదివారం మిరుదొడ్డి మండలం కొండాపూర్‌లో బొడ్రాయి ప్రతిష్ఠాపనోత్సవాల్లో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.