వెక్కిరిస్తున్న పనులు
కాంగ్రెస్ సర్కారు ఏర్పడి మూడేండ్ల్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఏఒక్క పని పూర్తి కాలేదు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో రూ.25 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శిలాఫలకాలు ఆవిష్కరించారు. పట్టణంలోని మల్లె చెరువు, కేసీఆర్ కాలనీ, కోమటిపల్లి గిరిజన తండా, పట్టణంలోని ప్రధాన రోడ్ల అభివృద్ధి కోసం నిధులు మంజూరైనా పనులు చేపట్టడంలో పూర్తిగా విఫలమయ్యారు.
- కాలనీల్లో నత్తనడకన పనులు.. మూడేండ్లు అయినా పూర్తికాని రోడ్లు
- పనులు పూర్తి చేయకుండా కాలం వెళ్లదీస్తున్న కాంగ్రెస్ సర్కారు
- మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో రూ.25 కోట్లకు పైగా పనులకు శంకుస్థాపనలు
రామాయంపేట, మే 1: కాంగ్రెస్ సర్కారు ఏర్పడి మూడేండ్ల్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఏఒక్క పని పూర్తి కాలేదు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో రూ.25 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శిలాఫలకాలు ఆవిష్కరించారు. పట్టణంలోని మల్లె చెరువు, కేసీఆర్ కాలనీ, కోమటిపల్లి గిరిజన తండా, పట్టణంలోని ప్రధాన రోడ్ల అభివృద్ధి కోసం నిధులు మంజూరైనా పనులు చేపట్టడంలో పూర్తిగా విఫలమయ్యారు. మెదక్ ఎమ్మెల్యే రోహిత్రావు ఆగమేఘాల మీద శిలాఫలకాలను ఎక్కడపడితే అక్కడ ఆవిష్కరించి రెండేండ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఏరోడ్డు కూడా పూర్తికాకపోవడం విడ్డూరంగా ఉంది.
ఏడాది పూర్తయినా నత్తనడకన పనులు కొనసాగుతుండటంపై పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్ల పనులు చేపట్టి సగంలోనే వదిలేశారు. దీంతో పట్టణంలోని ప్రజలు ఆరోడ్లపై నడవాలంటే కంకరకారణంగా ఇబ్బందులు తప్పడం లేదు. పనులు చేపట్టని కాంగ్రెస్ నాయకులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామాయంపేట పట్టణానికి సుదూరంలో ఉన్న కేసీఆర్ కాలనీలో రోడ్ల పనులు చేపట్టినా ఇప్పటి వరకు పూర్తికాలేదు. కాలనీవాసులు పట్టణానికి రావాలంటేనే రోడ్డు సరిగ్గా లేక జంకుతున్నారు. రాత్రిపూట అయితే వీధి దీపాలు లేవు, రోడ్డంతా గుంతలమయంగా మారింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, నాయకులు ప్రత్యేక చొరవ తీసుకుని రోడ్ల పనులు పూర్తి చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

