కాంగ్రెస్ మార్క్ రాజకీయం
మున్సిపల్ ఎన్నికల్లో కాం గ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నది. సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపల్ ఎన్నికల్లో రెండో వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలాపురం గీతాంజలి భర్త రమేశ్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం నుంచి సస్పెన్షన్‌కు గురయ్యాడు. రమేశ్ కొమురవెల్లి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు.
- సిద్దిపేట జిల్లా చేర్యాలలో బీఆర్ఎస్ అభ్యర్థి భర్తను ఉద్యోగం నుంచి సస్పెన్షన్ చేయించిన వైనం
- అధికార పార్టీ వైఖరిని నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేత
- కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు: బీఆర్ఎస్ అభ్యర్థి గీతాంజలి
చేర్యాల, ఫిబ్రవరి 8: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నది. సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపల్ ఎన్నికల్లో రెండో వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలాపురం గీతాంజలి భర్త రమేశ్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం నుంచి సస్పెన్షన్‌కు గురయ్యాడు. రమేశ్ కొమురవెల్లి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా భార్య గీతాంజలి నామినేషన్ వేసినప్పటి నుం చి ఏనాడు కూడా ఎన్నికల ప్రచారంలో, గులా బీ కండువా కప్పుకుని రమేశ్ ఎక్కడా కనిపించలేదు. శనివారం రాత్రి పోలీసులు ప్రత్యేక బృందంతో పట్టణంలోని 11వ వార్డులోని రమేశ్ ఇంటికి వచ్చి సస్పెన్షన్ కాపీ ఇచ్చారు.
సార్ తనకు ఆరోగ్యం బాగా లేదు రెండు రోజులుగా దవాఖానలో ఉన్నాను.. ఎలాంటి నోటీ సు ఇవ్వకుండా ఎందుకు సస్పెన్షన్ చేశారనడంతో పాటు దవాఖానలో పరీక్షలకు సంబంధించిన రిపోర్టులను పోలీస్ బృందానికి చూ పించి రమేశ్ కన్నిళ్లుపెట్టుకున్నాడు. పోలీస్ అధికారులతో వచ్చిన ప్రత్యేక బృందం రమేశ్‌తో సంతకం చేయించుకుని వెళ్లిపోయింది. రమేశ్‌తో పాటు ఆయన తల్లిదండ్రులు, భార్య, ముగ్గురు చిన్నారులు రాత్రి నుంచి ఉదయం వరకు ఏడుస్తూనే ఉన్నారు. ఉదయం వార్డు ప్రజలు ఇంటికి వచ్చి రమేశ్‌తో పాటు కుటుం బీకులకు ధైర్యంగాఉండాలని భరోసానిచ్చారు.
అంబేద్కర్ విగ్రహానికి వినతి
రెండో వార్డులో ప్రజల నుంచి తనకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేని కొందరు అధికార పార్టీకి చెందిన నాయకులు కలిసి కుట్ర పన్ని ఉద్యోగం నుంచి భర్తను సస్పెన్షన్ చేయించారని, తనకు సేవ చేయాలనే కోరికతో రాజకీయాల్లో వచ్చానని , ఇబ్బందులకు గురి చేస్తు న్న వారికి ఎన్నికల్లో బుద్ధిచెప్పాలని బీఆర్ఎస్ రెండో వార్డు అభ్యర్థ్ధి గీతాంజలి ఆరోపించారు. భర్తకు జరిగిన ఆన్యాయాన్ని ప్రజలకు తెలియజేసేందుకు వార్డు ముఖ్య నాయకులు, కుటుం బ సభ్యులతో కలిసి చేర్యాల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేయడంతో పాటు అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేసి ంది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమపై పోటీకి దిగిన అధికార కాంగ్రెస్ మహిళా అభ్యర్థి భర్త సంజీవులు ఇలాంటి ఘటనలకు దిగుతున్నాడని ఆరోపించారు. ఎన్నికల్లో ప్రజల వద్దకు వెళ్లి వారి మన్ననలు పొందాలి కానీ తమను అణిచి వేసేందుకు నామినేషన్లు వేసినప్పటి నుంచి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని,డబ్బులు సైతం ఇస్తామని కొందరి ద్వారా సమాచారం పంపించినట్లు ఆరోపించారు. భర్తను విధుల్లోకి తీసుకోవాలని, ఆయనకు ఎన్నికలతో సంబంధం లేదన్నారు. కుటుంబాన్ని ఆదుకోవాలని, అధికార పార్టీ నుంచి కాపాడాలని ఆమె వేడుకున్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

