కొండపాక(కుకునూర్‌పల్లి), అక్టోబర్ 9: సిద్దిపేట జిల్లా కొండపాక మాజీ ఎంపీపీ అనంతుల పద్మానరేందర్ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరారు. కోడెల ఐలయ్య, రాంపల్లి మల్లేశంతో సహా మరో 100మందితో కలిసి ఆయన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం బీఆర్ఎస్లో చేరారు.కాంగ్రెస్ పార్టీ రైతులకు కనీసం యూరియా ఇవ్వకపోవడం, ఆడపిల్లల పెళ్లిళ్లకు తులం బంగారం, లక్షరూపాయలు, వృద్ధులకు రూ. 4వేల పింఛను ఇవ్వకుండా మోసం చేసిందన్నారు.
హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూలగొట్టడం ఇవన్నీ చూసి కలత చెందామన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారుంటీలు సరిగా అమలు చేయకపోవడం, కొందరు కాంగ్రెస్ నాయకుల తీరు నచ్చక తాము బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, అనంతుల ప్రశాంత్, టీఆర్ఎస్ నాయకులు దుర్గయ్య, జైపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, బొద్దుల తిరుపతి, రాములుగౌడ్, భాను చందర్‌గౌడ్, స్వామి, రాము, హరీశ్, వెలికట్ట కరుణాకర్, అంజయ్య, నర్సింలు, దుద్దెడ దుర్గాప్రసాద్, అంకిరెడ్డిపల్లి, నల్మస్ వెంకటేష్, అనంతుల సంజయ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.