హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పదేండ్ల బీఆర్ఎస్ ప్రభు త్వంలో గజ్వేల్ నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెట్టిందని, ఆనాడు కేసీఆర్ హయాంలో చేసిన అభివృద్ధే నేడు కనిపిస్తున్నదని, రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో అన్నివర్గాలు మోసపోయాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు.
- ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
- గజ్వేల్ అభివృద్ధిలో కేసీఆర్‌ది చేరగని ముద్ర
- మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు
గజ్వేల్, మే 2: పదేండ్ల బీఆర్ఎస్ ప్రభు త్వంలో గజ్వేల్ నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెట్టిందని, ఆనాడు కేసీఆర్ హయాంలో చేసిన అభివృద్ధే నేడు కనిపిస్తున్నదని, రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో అన్నివర్గాలు మోసపోయాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల పరిధిలోని అక్కా రం గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు శనివారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రేవంత్‌రెడ్డి ప్రభు త్వం కాలయాపన చేస్తున్నదని, ఎంతో ఆశలో ఓట్లేసిన ప్రజలను మోసం చేసి ఇచ్చిన హామీలు విస్మరించారన్నారు.
బీఆర్ఎస్ హ యాంలోనే సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాయని గుర్తుచేశారు. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసి ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వకుండా దాటవేస్తున్నదన్నారు. గ్రామాల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై కొద్ది కాలంలోనే విరక్తి చెందారని, కేసీఆర్‌తోనే అభివృద్ధి సాధ్యమవుతుందనే విషయాన్ని ప్రజలు కూడా గ్రహించారన్నారు. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన వారిలో సింగర్ ఎల్లంతో పాటు పలువురు ఉన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మధు, మాజీ సర్పంచ్‌లు బాలచంద్రం, రాజు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

