జహీరాబాద్, అక్టోబర్ 30 : బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందని జహీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి కొనింటి మాణిక్‌రావు, రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, ఎన్నికల ఇన్‌చార్జ్జి దేవీప్రసాద్‌రావు తెలిపారు. సోమవారం జహీరాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఝరాసంగం మండలంలోని కాక్కర్వాడ గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మేస్త కాలనీకి చెందిన పలువురు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఇంటికీ సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందించి దేశంలోనే ఆదర్శంగా ఉందన్నారు. వ్యవసాయానికి నాణ్యమైన కరెంట్ సరఫరా, పేద విద్యార్థులు, అగ్రవర్ణ పేద విద్యార్థులు చదువుకొనేందుకు సీఎం కేసీఆర్ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశారన్నారు.
జహీరాబాద్ పట్టణంలో అన్ని కుల సంఘాలకు సామూహిక భవనాలు నిర్మాణం కోసం స్థలం, నిధులు మంజూరు చేశారన్నారు. జహీరాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. కాంగ్రెస్, బీజేపీలు ప్రజలకు సాధ్యంకాని హామీలు ఇచ్చి మోసం చేస్తున్నాయన్నారు. స్థానికుడిగా జహీరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, ఎన్నికలో ఓట్లు వేసి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, మాజీ కౌన్సిలర్ నామ రవికిరణ్, మాజీ పట్టణాధ్యక్షుడు ఎండీ యాకుబ్, ఝరాసంగం నాయకులు సంజీవ్, కాక్కర్వాడ గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీకి చెందిన సీహెచ్ రాజు, హెచ్ సిద్ధు, రుద్రప్ప, సంగన్న, గోవింద్, నర్సింహులుతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.