హుస్నాబాద్, మార్చి 1: హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి రిజర్వాయర్ పనులకు నిధులు కేటాయించాలని, హుస్నాబాద్-కొత్తపల్లి రహదారి పనులు పూర్తి చేయాలని కోరుతూ మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలకు రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వినతిపత్రం అందజేశారు. శుక్రవారం సచివాలయంలో ఇద్దరు మంత్రులను కలిసి పొన్నం గౌరవెల్లి రిజర్వాయర్, కొత్తపల్లి-హుస్నాబాద్ రోడ్డు పనుల ఆవశ్యకతను వివరించారు. వీటికి నిధులు కేటాయించి పూర్తి చేయాలని కోరారు. మంత్రులు సానుకూలంగా స్పందించారని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని మంత్రి పొన్నం తెలిపారు.