అందోల్, అక్టోబర్ 17: బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెడితే సహించేది లేదని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ హెచ్చరించారు. గురువారం జోగిపేటలో మాట్లాడుతూ..ఐదు రోజుల క్రితం బీఆర్ఎస్ నాయకుడు, వట్పల్లి మా ర్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ నవీన్‌రెడ్డి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు కు కాంగ్రెస్ నాయకులు ఆయనపై జోగిపేట పీఎస్‌లో ఫిర్యాదు చేశారన్నారు. దీనిపై ఎలాంటి విచారణ లేకుండానే పోలీస్‌స్టేషన్‌లో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారన్నా రు.
ఇదే విషయంపై మాట్లాడేందుకు స్థానిక నాయకులతో తాను గురువా రం జోగిపేట పీఎస్‌కి వెళ్లి ఎస్సైతో మాట్లాడగా….ఫిర్యాదు వస్తే కేసు నమోదు చేశామని, ఎవరు ఫిర్యాదు చేసినా సమన్యాయం పాటిస్తూ కేసు నమోదు చేస్తామని ఎస్సై తనకు సమాధానం చెప్పారన్నారు. దీంతో తాము కూడా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖల మంత్రి దామోదర రాజనర్సింహపై ఫిర్యాదు చేస్తామని, కేసు నమో దు చేయాలని కోరినట్లు చెప్పారు.
హైదరాబాద్‌లోని గాంధీ దవాఖాన లో మందుల కొరతపై ఓ జర్నలిస్టు మంత్రిని ప్రశ్నించగా, అతడిపై మం త్రి దురుసుగా ప్రవర్తించారని, దీనిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు అకారణంగా కేసులు నమోదు చేస్తున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నడూ ఇలా కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదని…ఎవరిపై కేసులు నమో దు చేయలేదన్నారు. తాను ఐదేండ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో అన్ని పార్టీల వారికి తగిన గౌరవం ఇచ్చానని, పార్టీలను ఎప్పుడూ చూడలేదన్నారు.
ఎన్నికలప్పుడే రాజకీయా లు చేయాలన్నారు. మంత్రిగా అందరికీ సమన్యాయం పాటిస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సిన మం త్రి దామోదర, ప్రతిపక్ష పార్టీల నాయకులపై కేసులు నమోదు చేయించడం సరికాదన్నారు. బీఆర్ఎస్ నాయకులకు కేసులు కొత్త కాదని, ఉద్యమం లో ఎన్నో కేసులు ఎదుర్కొన్నామని, ఇకనైనా అకారణంగా కేసులు పెట్ట డం, బీఆర్ఎస్ నాయకులను ఇబ్బందులకు గురిచేయడం మానుకోవాలని, లేదంటే మళ్లీ ఉద్యమాల బాట పట్టాల్సి వస్తుందని చంటి క్రాంతికిరణ్ హెచ్చరించారు. ఆయన వెంట ఏఎంసీ మాజీ చైర్మన్ నాగభూషణం, పార్టీ పట్టణ అధ్యక్షుడు శ్రీధర్, నాయకులు నాగరత్నంగౌడ్, మోగులయ్య, కిష్ణ్రగౌడ్ తదితరులు పాల్గొన్నారు.