అన్ని వర్గాలను ఆదుకునే ప్రభుత్వం బీఆర్ఎస్ సర్కారు అని, వచ్చే ఎన్నికల్లో పదికి పది సీట్లు గెలుస్తామని మంత్రి హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. బుధవారం సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా మెదక్‌లో ఏర్పాట్లను పరిశీలించి విలేకరులతో మాట్లాడారు. వచ్చే ఎన్నికలకు ప్రగతి శంఖారావాన్ని ముఖ్యమంత్రి మెదక్ నుంచే పూరించబోతున్నారని అన్నారు. సమైక్య పాలనలో వెనుకబాటు, తీవ్ర అన్యాయానికి గురైన మెదక్‌కు సీఎం కేసీఆర్ న్యాయం చేస్తున్నారన్నారు. కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించి పార్టీలో నూతనోత్సాహం నింపారన్నారు. సీఎం పర్యటన సందర్భంగా అన్నివర్గాల ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
మెదక్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట అని, ఇక్కడ పదికి పది అసెంబ్లీ స్థానాలు గెలుస్తామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం మెదక్‌లో సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో మంగళవారం ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మెదక్ ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌లతో కలిసి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత మెదక్‌లో నిర్వహించే సభ తొలిది అని, సీఎం కేసీఆర్ ప్రగతి శంఖారావాన్ని ఇక్కడి నుంచే పూరించబోతున్నారని తెలిపారు. అన్ని వర్గాలను ఆదుకునే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు.తెలంగాణ పాలన దేశానికి ఆదర్శంగా నిలిచినట్లు తెలిపారు. మెదక్ మంజీరా, హల్దీవాగులపై 14 చెక్‌డ్యామ్‌లను నిర్మించామని, రూ.100 కోట్లతో వనదుర్గా ఘనపూర్ ప్రాజెక్టు ఆయకట్టు పనులు చేశామన్నారు.
నాలుగు వరుసల రోడ్లతో మెదక్ తలుక్కుమంటున్నట్లు చెప్పారు. జిల్లాలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేసుకున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ కృషితో మెదక్ జిల్లాగా ఏర్పాటు అయ్యిందన్నారు. కొత్త సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాను నిర్మించుకున్నట్లు చెప్పారు. సమైక్య పాలనలో వెనకబాటు, తీవ్ర అన్యాయానికి గురైన మెదక్‌కు ఇప్పుడు న్యాయం జరుగుతున్నట్లు తెలిపారు. ఒకప్పుడు దుర్భిక్షం, రైతు ఆత్మహత్యలకు జిల్లా కేరాఫ్‌గా ఉండేదని, ఇప్పుడు పచ్చని మాగాణంగా మారినట్లు తెలిపారు. మెదక్ పట్టణం దినదినాభివృద్ధి చెందుతున్నట్లు తెలిపారు. రోడ్లు, కూడళ్లు, డ్రైనేజీలు, వైకుంఠధామాలు, వెజ్ నాన్‌వెజ్ మార్కెట్, మాతాశిశుకేంద్రం, దవాఖాన వంటి ఎన్నో పనులు చేసుకుంటున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. అన్నివర్గాలు పాల్గొని మెదక్ సీఎం కేసీఆర్ బహిరంగ సభ, కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించడంతో ప్రతిపక్షాలకు పాలుపోవడం లేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్తో మాత్రం నూతనోత్సాహం నెలకొన్నట్లు మంత్రి హరీశ్‌రావు చెప్పారు. మెదక్ నుంచే సీఎం కేసీఆర్ బుధవారం బీడీ టేకేదారులు, ప్యాకర్లకు పింఛన్ల పంపిణీ ప్రారంభిస్తారని, అలాగే దివ్యాంగులకు పెంచిన పింఛన్‌ను ఇక్కడి నుంచే పంపిణీని ప్రారంభిస్తారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మెదక్‌లో బుధవారం 32 మందికి సీఎం పింఛన్లు అందిస్తారని తెలిపారు.