కంది, ఆగస్టు 14: సంగారెడ్డి జిల్లా మంజీరా బ్యారే జ్ సమీపంలో ఉన్న మంజీరా అభయారణ్యానికి రాంసార్ గుర్తింపునకు ప్రతిపాదనలు పంపినట్లు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. స్ట్రీట్విట్ ల్యాండ్ అథారిటీ మెంబర్ సెక్రటరీ, సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రశాంతి ఆధ్వర్యంలో ఐఏఎస్ అధికారుల బృందం బుధవారం మంజీరా అభయారణ్యాన్ని సందర్శించింది.
బయోడైవర్సిటీ కార్యక్రమంలో భాగంగా మంజీరా అభయారణ్యా న్ని రాంసార్ గుర్తింపు కోసం ప్రతిపాదనలు పంపినట్టు బృందం తెలిపింది. మంజీరా అభయారణ్యం మంజీరా నది 9 దీవుల్లో 550 ఎకరాల్లో విస్తరించి ఉందని, సుమారు 300 రకాల పక్షులు, 160 ఇత ర జీవులు ఈ దీవుల్లో నివసిస్తున్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..ఆయా సీజన్లకు అనుగుణంగా వివి ధ రకాల వలస పక్షులు మంజీరాకు వలస వస్తున్నట్లు తెలిపారు.
రాంసార్ గుర్తింపుతో మంజీరా అభయారణ్యానికి ప్రపంచస్థాయి గుర్తింపు లభిస్తుందన్నారు. బోటులో ఐఏఎస్ బృందం సభ్యులు మంజీరాలోని 9 దీవుల్లో విస్తరించి ఉన్న వైల్డ్‌లైఫ్ శాంక్షురీనీ సందర్శించారు. కార్యక్రమంలో కేంద్ర బృందం సభ్యులు కీర్తిమాన వస్తి, కల్హేరసన్, డాక్టర్ జాన్సె మాత్యు, వికాస్ చంద్రగుప్త్తా, సంగారెడ్డి జిల్లా అటవీ శాఖ అధికారి శ్రీధర్ పాల్గొన్నారు.