సంగారెడ్డి, అక్టోబర్ 21: దేశ రక్షణకు పోలీసులు చేసిన త్యాగాలు మరువలేనివని, వారి ప్రాణత్యాగాలతోనే ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారని, ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసుల పాత్ర కీలకమని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా పోలీసు మైదానంలో స్మృతి పరేడ్ నిర్వహించి, అమరుల స్తూపానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పోలీసు అమరుల కుటుంబసభ్యలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అమరవీరుల కుటుంబాలకు జ్ఞాపికలు బహూకరించారు. ఎస్పీ చెన్నూరి రూపేశ్ ఆధ్వర్యం లో అమరుల కుటుంబసభ్యులతోపాటు కలెక్టర్ క్రాంతి ముఖ్యఅతిథిగా హాజరయ్యరు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అమరుల కుటుంబాలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. పోలీసుల సేవలు మనందరి మదిలో చిరస్మరణీయమన్నారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల నిర్మూలనలో జిల్లా పోలీసుశాఖ ముందంజలో ఉన్నదని పోలీసుల సేవలను కొనియాడారు.
అమరులైన పోలీసు కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి కుటుంబాల సంక్షే మం, వారికి ఆర్థిక పరమైన ప్రయోజనాలు చేకూరేలా కుటుంబాల్లో మనోధైర్యం అందించడమే పోలీసు అమరువీరులకు మనం అందించే నిజమై న నివాళి అన్నారు.
ప్రజల ధన, మాన ప్రాణ రక్షణకు ఏర్పడ్డ వ్యవస్థ పోలీసు వ్యవస్థ, శాంతిభద్రతల పరిరక్షణతోపాటు దేశ అంతర్గత భద్రత, ప్రభు త్వ ఆస్తుల పరిరక్షణ, ఇలా ప్రతి సందర్భల్లోనూ కీలకంగా పని చేస్తున్నదన్నారు. అమరుల త్యాగాలు గుర్తు చేసుకునేందుకు అక్టోబర్ 21న నుంచి 31 వరకు జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా ప్రజలకు పోలీసుల సేవలు చేరువయ్యేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు.
అక్టోబర్ 21, 1959లో సీఆర్పీఎఫ్ ఎస్సై కరమ్‌సింగ్ నాయకత్వంలోని 20మంది భారత్ జవాన్ల బృందం లడక్ ప్రాంతంలో హాట్స్ట్రింగ్ వద్ద విధు లు నిర్వహిస్తుండగా చైనా ఆర్మీ దొంగ దాడి చేసి 10 మందిని హతమార్చిందని ఎస్పీ చెన్నూరి రూపే శ్ తెలిపారు. అప్పటి నుంచి దేశ వ్యాప్తంగా విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరులను స్మరిస్తూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా (పోలీస్ ప్లాగ్ డే)గా నిర్వహిస్తునట్లు వివరించారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన సమస్యలు ఉండేవని, తెలంగాణలో నక్సలిజం ప్రభావం ఎక్కువగా ఉండేదని, ఆ సమయంలో ఎంతో మంది జవాన్లను కోల్పోవడం జరిగిందన్నారు.
జిల్లాకు చెందిన నలుగురు వీర జవాన్లు వివిధ ఘటనల్లో నక్సల్స్ , సంఘవిద్రోహ శక్తుల దుశ్చర్యలకు బలిఅయ్యారని ఎస్పీ గుర్తుచేశారు. ఇందులో సిర్గాపూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన జంగయ్య, సంగారెడ్డి పట్ట ణ స్టేషన్‌కు చెందిన ఎల్లయ్య, జిన్నారానికి చెందిన సత్యనారాయణ, కంగ్టి స్టేషన్‌కు చెందిన సురేశ్ విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించి వీరమరణం పొం దారని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ఎస్పీ ప్రార్థించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సంజీవరావు, డీఎస్పీలు సత్తయ్యగౌడ్, రామ్ మోహన్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, ఏఆర్ డీఎస్పీ నరేందర్, ఎస్బీ ఇన్స్పెక్టర్ విజయ్‌కృష్ణ, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేశ్, జిల్లా ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు రామరావ్, రాజశేఖర్, పరేడ్ కమాండర్ డా నియెల్, అమరవీరుల కుటుంబ సభ్యులు తది తరులు పాల్గొన్నారు.