సంగారెడ్డి, జనవరి 26 (నమస్తే తెలంగాణ): జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. శుక్రవారం గణతంత్ర వేడుకల్లో భాగంగా పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను కలెక్టర్ ఎగురవేశారు. ఎస్పీ రూపేశ్‌తో కలిసి పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నదన్నారు.
ప్రజాపాలనలో భాగంగా ప్రజల నుంచి 3,91,565 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్ స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీచైర్‌పర్సన్ మంజుశ్రీ, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డీసీఎంఎస్చైర్మన్ శివకుమార్, పాల్గొన్నారు.