సంగారెడ్డి కలెక్టరేట్, అక్టోబర్ 28: ప్రజావాణి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేసిశించారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్లోని గ్రీవెన్స్హాల్లో నిర్వహించిన ప్రజావాణికి జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన అర్జీదారులు తమ ఫిర్యాదులను అధికారులకు అందజేశారు. ప్రజావాణిలో మొత్తం 66 అర్జీలు వచ్చాయ న్నారు.
ఆయా అర్జీలను జిల్లా అదనపు కలెక్టర్లతో కలిసి కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..ఆయా అర్జీలను సకాలంలో పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, జిల్లా రెవెన్యూ అధికారి పద్మజారాణి, ఏవో పరమేశ్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.