సంగారెడ్డి కలెక్టరేట్, ఏప్రిల్ 3: సంగారెడ్డి జిల్లాలో పలువురు తహసీల్దార్లకు స్థాన చల నం జరిగింది.గురువారం సాయంత్రం కలెక్టర్ వల్లూరు క్రాంతి బదిలీ ఉత్తర్వులు జారీచేశా రు. 16 మంది తహసీల్దార్లను బదిలీ చేయగా, రాయికోడ్ నాయబ్ తహసీల్దార్‌కు ఎఫ్ఏసీ బాధ్యతలు అప్పగించారు. బదిలీ జరిగిన అధికారులు వెంటనే ఆయా స్థానాల్లో రిపోర్ట్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కాగా, జిల్లాలో బదిలీ అయిన తహసీల్దార్ల వివరాలు ఈవిధంగా ఉన్నాయి.
ఉమాశంకర్ సిర్గాపూర్ నుంచి అందోల్‌కు, నజీంఖాన్ను కంగ్టి నుంచి సిర్గాపూర్‌కు, భాస్కర్ నారాయణఖేడ్ నుంచి కంగ్టికి బదిలీ అయ్యారు. హసీనాబేగం మొగుడంపల్లి నుంచి నారాయణఖేడ్‌కు, ఎన్బీ విష్ణుసాగర్ అందోల్ నుంచి మనూర్‌కు, శ్రీనివాస్ రాయికోడ్ నుంచి మొగుడంపల్లికి, ఎం.వెంకటస్వామి మనూర్ నుంచి అమీన్‌పూర్‌కు బదిలీ అయ్యారు. పరమేశం ఏవో కలెక్టరేట్ నుంచి గుమ్మడిదలకు, దశరథ్ సూపరింటెండెంట్ నుంచి జహీరాబాద్‌కు బదిలీ అయ్యారు.
పి.ఆశాజ్యోతి మునిపల్లి నుంచి కందికి, అశోక్ సూపరింటెండెంట్-సీ నుంచి కొండాపూర్‌కు, వి.గంగాభవాని గుమ్మడిదల నుంచి మునిపల్లికి బదిలీ అయ్యింది. ఎస్.రవీందర్ జహీరాబాద్ నుంచి సూపరింటెండెంట్-సీకి, ఆర్.విజయలక్ష్మి కంది సూపరింటెండెంట్-హెచ్ ప్రొటోకాల్‌కు, రసీనా సుల్తానా సూపరింటెండెంట్-డీ నుంచి సూపరింటెండెంట్-జీకి బదిలీ అయ్యారు. ఆంథోనీ డయానిసియో డీఏవో అందోల్ నుంచి ఏవో కలెక్టరేట్‌కు బదిలీ అయ్యారు. కె.విజయ్ కుమార్ రాయికోడ్ ఎఫ్ఏసీ తహసీల్దార్‌గా కలెక్టర్ బాధ్యతలు అప్పగించారు.