మెదక్, మార్చి 1(నమస్తే తెలంగాణ): మెదక్ పట్టణంలో శనివారం కలెక్టర్ రాహుల్రాజ్ విస్తృతంగా పర్యటించారు. పట్టణంలో పలు అభివృద్ధి పనులకు స్థలాలను ఆయన గుర్తించారు.
పట్టణాన్ని శుభ్రంగా ఉంచాలని మున్సిపల్ సిబ్బందికి ఆదేశించారు. డ్రైనేజీలు, రోడ్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, రోడ్లపైన ఎకడా చెత్త కనిపించకుండా మున్సిపల్ సిబ్బందిని తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట అధికారి మహేశ్ తదితరులు ఉన్నారు.