మెదక్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): గ్రీవెన్స్‌లో అర్జీదారులు సమర్పించిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలని మెదక్ కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులకు సూచించా రు. సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని పురసరించుకొని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లతో కలిసి ఆయన వినతులు స్వీకరించా రు. ఈ సందర్భంగా
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను అధికారులు సాధ్యమైనంత త్వరగా పరిషరించాలని, లేనిపక్షంలో వారికి తగిన సూచనలు ఇవ్వాల్సిందిగా సూచించారు. ధరణి సమస్యలపై 30, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం 14, పింఛన్ల కోసం 2, ఎంప్లాయిమెంట్ కోసం ఒకటి, పంట రుణమాఫీకి సంబంధిం చి మూడు, ఇతర సమస్యలపై 36 దరఖాస్తు లు స్వీకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మెదక్ అర్బన్,అక్టోబర్ 28:అర్జీదారుల సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి అధికారులకు సూచించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి పలు ఫిర్యాదులు స్వీకరించారు.